arunachalam

ఈ పొస్ట్ లో మీకు అరుణాచలేశ్వరాలయము, గిరిప్రదక్షణ(Girivalam) వివరములను తెలియచేస్తాను, నాకు అరుణాచలం (Arunachalam) కోసం తేలుసుకోవడానికి 2 నెలలు సమయం పట్టింది. చెన్నై నుంచి 4-5గంటల ప్రయాణం, తిరుపతి నుంచి కూడ ట్రైన్ లు ఉన్నాయ్  . సరె రండి అరుణాచలం(Arunachalam) చుద్దాం .

అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.  ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి  శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.

ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము  చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో  వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .
పంచభూతలింగక్షేత్రములు
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం
త్వరలోనే మీరు నా బ్లాగు లో పంచభూతలింగక్షేత్రములు చూసి మీకు తెలియచెస్తాను .
 అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము  అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు  ఉంటాయి .



ఈ గోపురమే  చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు.  మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .


* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు  .. సాయంత్రం  3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు . గర్బగుడి ఒకటె తెరచి ఉండదు .


మీకో విషయం చెప్పడం మరిచాను . కిలి గోపురానికి ఎదురుగా  మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి   ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి  పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .
*  బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )
గిరి ప్రదక్షణం (గిరివలం _ Girivalam)
ఈ అరుణాచలం(Arunachalam) పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అవి

 అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి  2కి.మి దూరం వెళ్ళిన  తరువాత  కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది .  అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది . 
 దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు.. 
* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ..
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం  ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .

http://rajachandraphotos.blogspot.in/2012/02/blog-post.html

Read Users' Comments (0)